బంగ్లాదేశ్‌కు నిత్యావసర సరకులు సరఫరా చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సరకులు రవాణా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 42 వ్యాగన్లలో 2,477 టన్నుల ఎండు మిరపకాయలతో లోడ్ చేసిన ఒక రేక్‌ను ఏపీలోని తాడేపల్లిగూడెం నుంచి బంగ్లాదేశ్‌లోని దర్శన్ స్టేషన్‌కు రవాణా చేశారు. 4,928 టన్నుల ఎండు మిరపకాయలు, పసుపు, అల్లంను రెండు ర్యాక్‌లలో రెడ్డిపాలెం స్టేషన్ నుండి బెనాపోల్ రైల్వే స్టేషన్‌కు చేర్చారు. 2,472 టన్నుల ఉల్లిపాయలను లోడ్ చేసిన ఒక ర్యాక్‌ను నాగర్సోల్ స్టేషన్ నుంచి దర్శన్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: జెన్ జెడ్ స్పెషల్ శాంసంగ్ 'గెలాక్సీ ఏ51' విడుదల