దక్షిణ మధ్య రైల్వే రెండు రోజుల్లో 134 కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులను ప్రారంభించింది. విద్యుదీకరణ కోసం నియమించిన రెండు కొత్త విభాగాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని గుంతకల్ డివిజన్‌లో ధర్మవరం నుంచి కదిరి వరకు 77.89 కి.మీల ట్రాక్ పనులు, తెలంగాణ పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌లో లింగంపేట - జగిత్యాల - మోర్తాడ్ వరకు 56.5 కి.మీల వరకు గల ట్రాక్ పనులు 2017-18లో మంజూరు చేశారు.
మొదటి దశలో ధర్మవరం - కదిరి మధ్య విభాగం దూరం కోసం 77.89 కి.మీల ట్రాక్ పనులు పూర్తిచేశారు. మిగిలిన భాగాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. లింగంపేట - జగిత్యాల - మోర్తాడ్ 56.5 కి.మీల ట్రాక్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రైల్వేలైన్ల విద్యుదీకరణతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయని రైల్వేశాఖ భావిస్తోంది. పట్టాలపై సరుకు రవాణా చేయడంతో పాటు, ప్రయాణికుల రద్దీని తగ్గిస్తుందని రైల్వేశాఖ పేర్కొంది.