దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా... రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపులో వార్షిక తనిఖీ నిర్వహించారు. జనరల్ మేనేజర్ వ్యాగన్ వర్క్‌షాన్ నుంచి తనిఖీలు మొదలుపెట్టి అక్కడ సీసీటీవీ పర్యవేక్షణ గది, ప్రాథమిక చికిత్సా కేంద్రం, ఆర్వో వాటర్ ప్లాంట్, మహిళల విశ్రాంతి గదిని ప్రారంభించారు.
అనంతరం పీఓహెచ్ బాక్స్ రేక్‌ను ప్రారంభించారు. నూతన షెడ్‌కు శంకుస్థాపన చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనరల్ మేనేజర్ మొక్కలు నాటారు. సూపర్‌వైజర్ల మీటింగ్ హాల్ కమ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.