ETV Bharat / city

sonusood: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ - సినీ నటుడు సోనూసూద్

విజయవాడ కనక దుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ దర్శించుకున్నారు. కరోనా వైరస్​ నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని ఆయన తెలిపారు.

sonusood
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సోనూ సూద్
author img

By

Published : Sep 9, 2021, 4:47 PM IST

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌.. ఏపీలోని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను మహమ్మారి బారినుంచి రక్షించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన వెల్లడించారు.

ఘనంగా స్వాగతం

ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సాదరంగా ఆహ్వానం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం సిబ్బంది, వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం ఆయనకు అందజేశారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా సోనూ సూద్ అన్నారు. అందరినీ దుర్గమ్మ చల్లగా చూడాలని దుర్గమ్మను కోరుకున్నానని ఆయన తెలిపారు.

సోనూ సూద్

లాక్​ డౌన్​ సమయంలో ప్రజలకు సాయం

కరోనా సమయంలో ఎంతో మంది నిరాశ్రయులకు సేవలందించారు. లాక్​ డౌన్ సమయంలో ఎంతోమంది అభాగ్యుల ఆకలి తీర్చి ఆదుకున్నారు. సమాజ సేవ చేస్తూ ప్రజల గుండెల్లో సోనూ సూద్​ నిజ జీవితంలో హీరోగా నిలిచిపోయాడు.

ఇదీ చదవండి: Weather Report: 11వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.