Son left his mother on road: సమాజంలో నానాటికీ మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డకు.. ఆ తల్లి బరువైంది. వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నకుమారుడే.. తల్లిని భారంగా భావించి నిర్ధాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో జరిగింది. ఒకరోజు తర్వాత స్థానిక నేతలు చూసి.. ఆ వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించారు.
చక్రాయపేట మండలం అగ్రహారానికి చెందిన అనుమక్క ఆదివారం వాలంటీరు ద్వారా సామాజిక పింఛను అందుకుంది. ఆ పింఛను మొత్తాన్ని కుమారుడు వెంకటరమణ తీసుకున్నాడు. ఆటోలో వేంపల్లెకు తీసుకొచ్చి స్థానిక మెయిన్ బజార్‌లో తన తల్లిని వదిలేసి వెళ్లాడు. ఆ రోజంతా ఆమె అక్కడే ఉండిపోయింది. సోమవారం ఈ సమాచారం తెలుసుకున్న వేంపల్లె ఎంపీటీసీ సభ్యుడు కటిక చంద్ర, ముత్యాల రమేష్‌బాబు, ప్రసాద్ ఈ విషయాన్ని స్థానిక రాజీవ్‌నగర్ కాలనీలోని మదర్ థెరిసా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు వెంకటసుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లి ఆమెను అక్కడికి తరలించారు.
ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని... అందినకాడికి దోచేశాడు