ETV Bharat / city

Solvent leak on Road: రోడ్డుపై లీకైన సాల్వెంట్.. 7 గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది - పశ్చిమ గోదావరి జిల్లా తాజా సమాచారం

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆయిల్ ట్యాంకర్​లో టెట్రా హైడ్రా ఫ్యూరాన్ అనే మండే స్వభావం కలిగిన సాల్వెంట్ రోడ్డుపై లీక్ అవడంతో(Solvent leak on Road) లారీని పక్కకు ఆపివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. లీకైన సాల్వెంట్​పై నీళ్లు, ఫోమ్ని చల్లి మంటలు వ్యాపించకుండా నిర్వీర్యం చేశారు.

Solvent leak on Road: రోడ్డుపై లీకైన సాల్వెంట్.. 7 గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

author img

By

Published : Nov 25, 2021, 12:51 PM IST

Solvent leak on Road: రోడ్డుపై లీకైన సాల్వెంట్.. 7 గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

Solvent leak on Road: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari district) ద్వారక తిరుమల మండలం గుణ్ణంపల్లి శివారు లక్ష్మీ నగరం వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆయిల్ ట్యాంకర్​లో టెట్రా హైడ్రా ఫ్యూరాన్ అనే మండే స్వభావం కలిగిన సాల్వెంట్ రోడ్డుపై లీక్ అవడంతో లారీని పక్కకు ఆపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకైన సాల్వెంట్​పై నీళ్లు, ఫోమ్ చల్లి మంటలు వ్యాపించకుండా నిర్వీర్యం చేశారు.

వైజాగ్​లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి ఆయిల్ ట్యాంకర్​లో టెట్రా హైడ్రా ఫ్యూరాన్ అనే సాల్వెంట్​ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్యాంకర్ లారీ గుణ్ణంపల్లి సమీపానికి వచ్చేసరికి వాల్ లీకై సాల్వెంట్ రోడ్డుపై పడటం ప్రారంభమైంది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ ట్యాంకర్​ను పక్కకు నిలిపివేశాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా... భీమడోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. సుమారు 7 గంటలు శ్రమించి ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న సాల్వెంట్​ను నిర్వీర్యం చేశారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు భయపడాల్సిన పనిలేదని ఇండస్ట్రీస్ డిప్యూటీ చీఫ్ ఇన్​స్పెక్టర్ త్రినాథరావు తెలిపారు.

ఇదీ చదవండి

రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా దుర్మరణం- వైద్యం అందక చిన్నారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.