ETV Bharat / city

Small Eggs in Anganwadi centres : అంగన్​వాడీల్లో గుడ్లపై 'చిన్న'చూపు - అంగన్​వాడీల్లో గుడ్లు వార్తలు

Eggs in Anganwadi centres : అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కోసం అందించే గుడ్లలో 'చిన్న'చూపు కనిపిస్తోంది. మార్కెట్​లో అమ్ముడుపోని గుడ్లను అంగన్​వాడీ కేంద్రాలకు తరలించి.. వాటిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటిని తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అంగన్​వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.

Small Eggs in Anganwadi centres
Small Eggs in Anganwadi centres
author img

By

Published : Apr 20, 2022, 11:50 AM IST

Eggs in Anganwadi centres : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు ఇస్తుంటారు. ఒక్కో గుడ్డు బరువు 45 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. కానీ.. గుత్తేదారులు మార్కెట్‌లో అమ్ముడుపోని చిన్నసైజు గుడ్లను సరఫరా చేస్తున్నారు. వాటి బరువు 30 నుంచి 35 గ్రాముల్లోపే ఉంటోంది. 'మరీ గోలీ సైజులో ఉన్నవాటిని తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. పైగా తమతో వాగ్వాదానికి దిగుతున్నారు.

2 నెలల నుంచి ఏపీలోని విజయవాడలో అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నవే సరఫరా చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు’ అని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.