ETV Bharat / city

రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోన్న కరోనా ఉద్ధృతి - telangana latest corona information

వేగంగా పెరుగుతూ వచ్చిన కరోనా కొంత తగ్గుముఖం పట్టింది. ఐసీయూల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. శనివారం దాదాపుగా అన్ని ఆసుపత్రుల్లోని ఐసీయూలో దాదాపు 68 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయి. రానున్న శీతాకాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

slowly decreasing corona in telangana state
రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోన్న కరోనా ఉద్ధృతి
author img

By

Published : Oct 19, 2020, 5:41 AM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టింది. జీహెచ్‌ఎంసీలో తొలి నుంచీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. గత జులై నుంచి సెప్టెంబరు వరకూ రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌ నగర జిల్లాల్లోనూ కొవిడ్‌ కేసులు వేగంగా విస్తరించాయి. గత నెల రోజులుగా చాలాచోట్ల కొవిడ్‌ జోరు తగ్గింది. ఐసీయూల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. శనివారం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూలో దాదాపు 68 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో 17.11 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం గత నెల రోజుల్లో 39 శాతం మేరకు కొవిడ్‌ కేసుల నమోదు పెరిగాయి. త్వరలో శీతాకాలం ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో వరుసగా పండుగలు రానుండడంతో.. ప్రజలు వైరస్‌ నివారణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే తిరిగి కొవిడ్‌ విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

83 శాతం మంది ఇళ్లలోనే..

* కరోనా నిర్ధారణ అయినవారిలో 82.89 శాతం మందిలో లక్షణాలు అసలు లేకపోవడం, లేదా స్వల్ప స్థాయిలో ఉంటున్నాయి.

* ఇటువంటి వారు ప్రస్తుతం రాష్ట్రంలో 18,279 మంది ఇళ్లలో ఉండే చికిత్స పొందుతున్నారు.

* శనివారం నాటికి 3,771 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

* ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,553 మంది చికిత్స పొందుతుండగా.. ఐసీయూలో వైద్యసేవలు పొందుతున్నది 488 మంది మాత్రమే.

* ప్రభుత్వ వైద్యంలో 1,109 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి.

* ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 2,218 మంది చికిత్స పొందుతుండగా.. ఐసీయూలో చికిత్స పొందుతున్నది 697 మంది మాత్రమే.

* 227 ప్రైవేటు ఆసుపత్రుల్లో 2,180 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి.

* నెల రోజుల కిందట పేరున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 70-80 శాతం వరకూ ఐసీయూ పడకలు నిండిపోగా.. ఇప్పుడు 50 శాతం పడకల్లోనే రోగులు ఉన్నారు.

* ఈ గణాంకాల ప్రకారం.. కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా.. ఆసుపత్రుల్లో చేరకుండా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదీ చూడండి: భారీ వర్షం కురిసిన.. విద్యుత్​ సరఫరాకు అంతరాయం లేకుండా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.