తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అనుబంధ డిజిథాన్ మరోమారు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రూపొందించిన టీ-కన్సల్ట్ యాప్ ద్వారా మక్తల్ నియోజకవర్గంలో అందించిన ఉచిత ఆన్‌లైన్ వైద్య సేవలకు గుర్తింపుగా స్కోచ్-2020 అవార్డు సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 20,000 ఆన్‌లైన్ కన్సల్టేషన్లు పూర్తి చేసి పల్లె ప్రజలకు అందించిన సేవలను జ్యూరీ ప్రశంసించింది. 69వ స్కోచ్ సమ్మిట్‌లో నారాయణపేట కలెక్టర్ హరిచందన... ఈ అవార్డును స్వీకరించారు.
అవార్డు దక్కినందుకు నారాయణపేట కలెక్టర్ హరిచందన హర్షం వ్యక్తం చేశారు. టీ-కన్సల్ట్ టీం క్షేత్రస్థాయిలో చేసిన విశేష కృషికి... దక్కిన గుర్తింపే ఈ అవార్డు అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందకపోవడాన్ని చూసి చలించి... టీ-కన్సల్ట్ యాప్ రూపొందించినట్టు టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల అన్నారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించి... వారి ప్రాణాలు రక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కృషికి దక్కిన గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తున్నామన్నారు. సేవలు అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ఈ ప్రోత్సాహం... ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.
ఇదీ చూడండి: బోర్డు పరీక్షలు వాయిదా- ఫిబ్రవరి తర్వాతే