Lady Teachers in Telangana Schools : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన జిల్లా విద్యా సమాచార వ్యవస్థ(యూడైస్) 2020-21 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 42,917 ఉండగా, వాటిలో 3,20,216 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో 1,92,337 మంది (60.06 శాతం) మహిళలు కాగా.. మిగిలిన 1,27,879 మంది పురుష ఉపాధ్యాయులు.
ప్రైవేట్ పాఠశాలల్లోనే మహిళా ఉపాధ్యాయులు అధికం
Women Teachers in Telangana Schools : రాష్ట్రంలో వివిధ రకాల గురుకులాలు సహా అన్ని ప్రభుత్వ పాఠశాలలు 30,015 ఉండగా అందులో మొత్తం 1,38,468 మంది ఉపాధ్యాయులున్నారు. వారిలో 64,320 మంది (46 శాతం) మహిళలున్నారు. అంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే మహిళా ఉపాధ్యాయుల శాతం అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.