ETV Bharat / city

హవాలా మార్గంలో సంపాదన.. కోటి రూపాయల జప్తు...! - undefined

Six arrested over hawala way.
Six arrested over hawala way.
author img

By

Published : Dec 20, 2019, 4:52 PM IST

Updated : Dec 20, 2019, 8:05 PM IST

16:47 December 20

హవాలా మార్గంలో సంపాదన.. కోటి రూపాయల జప్తు...!

Six arrested over hawala way.

          హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను తూర్పు మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారం మేరకు ఈ నెల 16న గౌలిగూడలోని బాలాజీ స్వీట్ వద్ద వేచి ఉన్న ఈశ్వర్ రెడ్డిని పోలీసులు తనిఖీ చేయగా.. బ్యాగులో 80లక్షల రూపాయలు బయటపడ్డాయి. ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడం వల్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.

తీగలాగితే డొంక కదిలింది...!

         డైనమిక్ టూల్స్ యజమాని రాజ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ డబ్బు ముగ్గురు వ్యక్తుల నుంచి తీసుకున్నట్లు ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. అతడు ఇచ్చిన  సమాచారం ఆదారంగా.. పోలీసులు ఉస్మాన్ షాహీలోని ముగ్గురి ఇళ్లలో తనిఖీలు చేయగా మరో 20లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఈశ్వర్ రెడ్డి, రాజ్ కుమార్, రాజేశ్ శర్మ,  రామ్ రాజ్, ప్రకాశ్ సింగ్, విశాల్ విశ్వనాథ్ లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. నగదు మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖాధికారులకు అప్పజెప్పారు.

ఇవీ చూడండి: జ్యుడిషియల్ కస్టడీ.. అక్రమ నిర్బంధం కాదు: హైకోర్టు

Intro:Body:Conclusion:
Last Updated : Dec 20, 2019, 8:05 PM IST

For All Latest Updates

TAGGED:

HYD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.