ETV Bharat / city

'దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఓ బూటకం..' కుటుంబ సభ్యుల వాంగ్మూలం - కుటుంబ సభ్యుల వాంగ్మూలం

దిశ నిందితుల ఎన్​కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ విచారణలో భాగంగా... మృతుల కుటుంబ సభ్యులు ఈరోజు కమిషన్ ఎదుట హాజరయ్యారు. బాధితుల వాంగ్మూలాన్ని కమిషన్ నమోదు చేసుకుంది. రేపు కూడా మృతుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ సాక్ష్యం సేకరించనుంది.

sirpurkar commission enquiry on Disha accused encounter

author img

By

Published : Sep 3, 2021, 10:27 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్ బూటకమని.. మృతుల కుటుంబ సభ్యులు కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని... పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూర్కర్ కమిషన్ విచారణలో భాగంగా... మృతుల కుటుంబ సభ్యులు ఈరోజు కమిషన్ ఎదుట హాజరయ్యారు. బాధితుల వాంగ్మూలాన్ని కమిషన్ నమోదు చేసుకుంది. రేపు కూడా మృతుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ సాక్ష్యం సేకరించనుంది.

2019 నవంబర్ 27వ తేదీన ఓ యువ వైద్యురాలిని నలుగురు యువకులు తొండుపల్లి టోల్​గేట్ సమీపంలో హత్యాచారం చేశారు. ఆ తర్వాత షాద్​నగర్​ సమీపంలో జాతీయరహదారి వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. కేసు నమోదు చేసుకున్న షాద్​నగర్ పోలీసులు ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. దర్యాప్తులో భాగంగా కస్టడీలోకి తీసుకున్న షాద్​నగర్ పోలీసులు... 2019 డిసెంబర్ 6వ తేదీన సీన్​ రికన్​స్ట్రక్షన్​ కోసం ఘటనా స్థలానికి నిందితులను తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు.... పోలీసుల వద్ద ఉన్న రెండు తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్​కౌంటర్​పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిర్పూర్కర్ కమిషన్ ఎన్​కౌంటర్​పై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

viral video: వియ్యంకుల మధ్య గొడవ... వైరల్​గా మారిన దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.