గణిత మేధావి నీలకంఠ భానుప్రకాశ్ మైండ్ స్పోర్ట్స్ ఒలంపిక్స్‌లో స్వర్ణం గెలిచిన రోజును.. మైండ్ స్పోర్ట్స్డేగా నిర్వహించాలని శిక్షణ అకాడమీ సిప్ కోరింది. ఈ మేరకు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని ఎస్ఐపీ అకాడమీ సీఈవో దినేష్ విక్టర్ పేర్కొన్నారు. భారత్ తరుపున స్వర్ణం గెలిచిన తమ విద్యార్థి భానుప్రకాశ్‌ను ఈ సందర్భంగా అకాడమీ సన్మానించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో భానుప్రకాశ్‌తో సిప్ అబాకస్ అకాడమీలో శిక్షణ పొందుతోన్న దేశవ్యాప్త విద్యార్థులు ఇంటరాక్ట్ అయ్యారు. గణితంలో గ్లోబల్‌గా గుర్తింపు పొందటానికి భానుప్రకాష్ చేసిన జర్నీపై విద్యార్థులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. నాతోపాటు.. ఎవరైనా ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్‌గా రాణించవచ్చని.. సబ్జెక్ట్‌పై ఇష్టంతో సాధన చేస్తే పట్టు సాధించి నిష్ణాతులు కావచ్చని భానుప్రకాశ్ తెలిపారు. నా వరకు మైండ్ క్యాలిక్యులేషన్సే తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి : కీసర లంచం కేసులో నిందితుల బెయిల్ తిరస్కరణ