ETV Bharat / city

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీకి సర్కార్​ షోకాజ్ నోటీసు - ఏపీ ఇంటెలిజెన్స్ తాజా సమాచారం

Show cause notice to ABV Rao: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం తప్పేనంటూ ఆయనకు మెమో జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది.

ABV Rao
ABV Rao
author img

By

Published : Apr 5, 2022, 1:12 PM IST

Show cause notice to ABV Rao: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతనెల 21న ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం తప్పేనంటూ ఆయనకు మెమో జారీ చేసింది. ఏబీవీ ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించలేదని నోటీసులో పేర్కొంది. మెమో అందిన వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది.

ఈ నోటీసులకు సమాధానం చెప్పని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ఏపీ సర్కార్​ ఆయన్ను హెచ్చరించింది. ఏబీవీ మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ సీఎస్‌ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. మార్చి 31న ఏబీవీ మీడియా సమావేశంలో పెగాసస్‌తో పాటుగా తన సస్పెన్షన్ అంశాలపై మాట్లాడారు.

ఇదీ చదవండి: KTR On Y-Hub: యువత కోసం వై హబ్‌ ఏర్పాటు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.