ETV Bharat / city

రాష్ట్రంలో సన్న ఇసుక కొరత.. చెలరేగుతున్న అక్రమార్కులు - రాష్ట్రంలో సన్న ఇసుక కొరత

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ఇసుక సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రోడ్లు దెబ్బతిని రీచ్‌లకు లారీల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలో సన్న ఇసుక కొరత ఏర్పడింది. అదే అదనుగా అక్రమార్కులు రెచ్చపోతున్నారు. ఎక్కడబడితే అక్కడ ఇసుకను అక్రమంగా తోడేస్తూ ట్రాక్టర్లలో తరలించి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో టన్ను రూ. 1350 నుంచి రూ.2200కు చేరటమే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రంలో సన్న ఇసుక కొరత
రాష్ట్రంలో సన్న ఇసుక కొరత
author img

By

Published : Jul 29, 2022, 4:56 AM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. ఇసుక సరఫరా, ధరలు, నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అనేక ఇసుక రీచ్‌ల చుట్టూ వరద చేరగా, వాటికి వెళ్లే రహదారులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఇసుక అధికారిక లోడింగ్‌ భారీగా పడిపోయింది. ఇదే అదనుగా అక్రమార్కులు ఎక్కడబడితే అక్కడ ఇసుకను అక్రమంగా తోడేస్తూ ట్రాక్టర్లలో తరలించి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఫలితంగా పక్షం రోజుల్లోనే ఇసుక ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. సన్న ఇసుకకు తీవ్రంగా కొరత ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ పరిమాణం తక్కువ ఉండటంతో డిమాండ్‌ బాగా పెరిగింది.

రూ.2 వేలు దాటిన ధర: సన్న ఇసుక ధర 15 రోజుల క్రితం టన్నుకు రూ.1,350 ఉండేది. నాలుగురోజుల క్రితం రూ.2,200 వరకు వెళ్లింది. ఇప్పుడు రూ.2,000-2,200 పెట్టాల్సివస్తోంది. చౌటుప్పల్‌ వంటి ప్రాంతాల్లో అయితే రూ.2,500 వరకు పలుకుతోంది. దొడ్డు ఇసుక టన్ను రూ.1,300 నుంచి రూ.1,700కు పెరిగింది. ఇసుక సరఫరా గణనీయంగా పడిపోవడంతో నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. ఇంటి బడ్జెట్‌పైనా ధరలు ప్రభావం చూపుతున్నాయని సామాన్యుల వాపోతున్నారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆన్‌లైన్‌ బుకింగ్‌లతో విక్రయించే ఇసుకలో 80శాతానికి పైగా గోదావరి నుంచే వస్తోంది. వర్షాకాలంలో గోదావరిలో వరద నీటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే గుత్తేదారులతో ఇసుకను తోడించి రీచ్‌ల స్టాక్‌పాయింట్లలో నింపించింది. అయితే అనేక రీచ్‌లకు వెళ్లే రోడ్లు దెబ్బతినడంతో సమస్య పెరిగింది. దీంతో ఆన్‌లైన్‌ బుకింగ్‌, అధికారిక ఇసుక లోడింగ్‌ పడిపోయింది. ఫలితంగా ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి.

80 రీచ్‌ల నుంచి పదికి..

  • జూన్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 80 రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అయ్యింది. గురువారం ఆన్‌లైన్‌ బుకింగ్‌కు 10 రీచ్‌లు పెడితే, 6 రీచ్‌ల నుంచే ఇసుక లోడింగ్‌ అయ్యింది.
  • ఒక్క ములుగు జిల్లాల్లోనే 80 ఇసుక రీచ్‌లు ఉంటే రోడ్లు దెబ్బతినడం కారణంగా ప్రస్తుతం ఒక్క రీచ్‌ నుంచే ఇసుక సరఫరా అవుతోంది. బుధవారం అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా రీచ్‌ నుంచి 12.50 టన్నులు, మేడ్చల్‌ రీచ్‌ నుంచి 30 టన్నుల ఇసుక మాత్రమే లోడింగ్‌ చేశారు.
  • పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి 2,555.50 టన్నుల ఇసుకే లోడింగ్‌ అయ్యింది.
  • నది ఇసుకలో సన్న ఇసుకకు బాగా డిమాండ్‌ ఉంటుంది. దొడ్డు ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక (రోబో శాండ్‌ లేదా మాన్యుఫాక్చర్‌ శాండ్‌) దొరుకుతుంది. ప్లాస్టరింగ్‌ వంటి పనులకు సన్న ఇసుకే కావాలి. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని రీచ్‌ల్లో పూర్తిగా, భారీగా సన్న ఇసుక దొరుకుతుంది. అక్కడ లోడింగ్‌ ఆగడంతో భద్రాద్రి జిల్లా రీచ్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది. హైదరాబాద్‌కు ఆ రీచ్‌ల దూరం అధికం.
  • జూన్‌లో 21,91,509.24 టన్నుల ఇసుకను టీఎస్‌ఎండీసీ విక్రయించింది. సగటున రోజుకు 70,050 టన్నులు.
  • జులైలో 4,55,407.26 టన్నుల ఇసుక విక్రయాలే జరిగాయి. రోజుకు సగటున 16,866 టన్నులే.

బుకింగ్‌ ఏజెంట్లకు మూడింతల ఆదాయం: ఇసుక బుకింగ్‌ ఆన్‌లైన్‌ విధానం కావడంతో దీనిపై అవగాహన ఉన్నవారి సేవల్ని లారీ యజమానులు తీసుకుంటున్నారు. ‘గతంలో ఒక్కో బుకింగ్‌కు రూ.500-రూ.1,000 ఇచ్చేవాళ్లం. ఇప్పుడు రూ.2 వేలిస్తున్నాం. సన్న ఇసుక బుక్‌ చేస్తే రూ.2,500-రూ.3,500 వరకు ఇస్తున్నాం’అని ఓ లారీ యజమాని చెప్పారు.

అక్రమంగా ట్రాక్టర్లలో.. ఆ తర్వాత లారీల్లో: ఆన్‌లైన్‌ బుకింగ్‌, ఇసుక సరఫరాకు దాదాపు 50 వేల లారీల నంబర్లు టీఎస్‌ఎండీసీ వెబ్‌సైట్‌లో నమోదయ్యాయి. బుకింగ్‌ను బట్టి అవి రీచ్‌లకు వెళ్లి ఇసుకను నింపుకొని సరఫరా చేస్తాయి. రహదారులు దెబ్బతినడంతో గోదావరి పరీవాహక ప్రాంతంలో లారీలు, డ్రైవర్లు వారం, పది రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. మరోపక్క అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక లోడింగ్‌ బాగా తగ్గిపోవడంతో అక్రమార్కులు ట్రాక్టర్లలో తీసుకువచ్చి ఇసుక డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపై అక్రమ ఇసుకను లారీల్లో తరలిస్తున్నారు.

"ఇసుక లోడింగ్‌ నిలిచిపోవడంతో లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెలకు రూ.70 వేల నుంచి రూ.లక్ష రుణ వాయిదా కట్టాలి. కొందరు ఉండలేక, ఖాళీగా రాలేక బిల్లు లేకుండా డంప్‌ల నుంచి ఇసుక తేవడంతో అధికారులు ఒక్కో లారీకి రూ.లక్ష, రూ.రెండు లక్షల జరిమానాలు వేస్తున్నారు." - సుర్వి యాదయ్యగౌడ్‌, ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర లారీ డ్రైవర్ల సంక్షేమ సంఘం

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.