ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో దుకాణదారులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచి అనంతరం మూసేస్తున్నారు. జిల్లాలోని మలికిపురం, రాజోలు, తాటిపాకలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అమలాపురంలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతున్నారు. రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందని.. లాక్డౌన్ ఉన్నంతకాలం ఈ విధంగా దుకాణాలు ఒంటి గంట వరకే తెరిచి ఉంచుతామని వ్యాపారులు తెలుపుతున్నారు
ఇవీ చూడండి: దుకాణాలు తెరిచేందుకు నిబంధనలు.. ఉత్తర్వులు జారీ