తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా శివసేనారెడ్డి నియమితులయ్యారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లలో జరిగిన ఎన్నికల్లో 59వేల 997 ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు.
గతేడాది డిసెంబర్లో అత్యధిక ఓట్లు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి జాతీయ నాయకులు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో విజయం సాధించిన శివసేనా రెడ్డిని జాతీయ నాయకులు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
యువజన కాంగ్రెస్ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, పార్టీ విధివిధానాలకు లోబడి పనిచేస్తానని శివసేనా రెడ్డి తెలిపారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తాను రాష్ట్ర అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు అవకాశమిచ్చిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు.
- ఇదీ చూడండి : ఈనెల 11న ఉచిత తాగునీటి పథకం ప్రారంభం