'ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం... మూడు షిఫ్టుల్లో కౌంటింగ్...' - mlc election counting
హైదరాబాద్, నల్గొండలో రేపు నిర్వహించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు. మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని... రేపు సాయంత్రం వరకు బండెల్స్ కట్టే ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని చెప్పారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ కౌంటింగ్ చేస్తామని చెబుతున్న ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
shashank goyal interview on graduate mlc election counting arrangements