ETV Bharat / city

కొత్త మద్యం పాలసీ విధివిధానాలు ఏమిటంటే? - wine

శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వచ్చే రెండు సంవత్సరాల కోసం మద్యం షాపుల నిర్వహణకు గానూ నూతన మద్యం పాలసీని శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు.

మద్యం పాలసీని ప్రకటించిన శంషాబాద్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్​
author img

By

Published : Oct 9, 2019, 7:52 PM IST

మద్యం పాలసీని ప్రకటించిన శంషాబాద్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్​

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో శేరిలింగంపల్లి, శంషాబాద్, చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో మొత్తం 81 మద్యం షాపులకు టెండర్లను పిలుస్తున్నట్లు సూపరింటెండెంట్ జనార్దన్​రెడ్డి వెల్లడించారు. నవంబర్ ఒకటి నుంచి ప్రారంభం కానున్న షాపులకు గానూ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​లోని చెట్లల్ల కృష్ణయ్య ఫంక్షన్ హాల్ గార్డెన్​లో ఈరోజు నుంచి వచ్చే 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన వివరించారు. షాపుల కేటాయింపు ఈనెల 18వ తేదీన జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరుగుతుందని జనార్దన్ రెడ్డి తెలిపారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు రెండు లక్షల ఫీజు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది. గతంలో ఫీజు మొత్తంలో ఎనిమిదవ వంతు ఆరు వాయిదాల్లో చెల్లించడం జరిగేది. అయితే నూతన పాలసీ ప్రకారం ఫీజు చెల్లింపు ఎనిమిది వాయిదాలకు పెంచినట్లు సూపరింటెండెంట్ వివరించారు. బ్యాంక్ గ్యారెంటీని 50 శాతంకు తగ్గించారు. ఒక దరఖాస్తుదారుడు ఎన్ని షాపులకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు... కానీ మొదటగా షాపు అలాట్​మెంట్ అయిన తర్వాత మిగతా షాపులలో అతని దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు.

ఇవీ చూడండి: "హైదరాబాద్​లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"

TG_HYD_23_09_EXCISE ACTION_AB_TS10020 M.Bhujangareddy. 8008840002. (Rajendranagar) note: feed from desk whatsapp. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వచ్చే రెండు సంవత్సరాల కోసం మద్యం షాపుల నిర్వహణకు గానూ నూతన మద్యం పాలసీని ప్రకటించిన శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మద్యం నూతన పాలసీ విధానం ప్రకటించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో శేరిలింగంపల్లి, శంషాబాద్, చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో మొత్తం 81 మద్యం షాపులకు టెండర్లను పిలుస్తున్నట్లు వెల్లడించిన సూపరింటెండెంట్. శేరిలింగంపల్లి లోని 32, శంషాబాద్ పరిధిలోని 28 మద్యం షాప్ లకు గానూ ఒక్కొక్క షాపుకు సంవత్సరానికి కోటి పది లక్షల రూపాయలు, చేవెళ్ల ప్రాంతంలోనూ, పాలమాకుల ప్రాంతంలోని షాపులకు షాపులకు మాత్రం ఏడాదికి 55 లక్షలు, మొయినాబాద్, ఎంకేపల్లి, మోకిల, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని షాపులకు మాత్రం ఏడాదికి 50 లక్షల రూపాయలను ఫీజుగా నిర్ణయించినట్లు వెల్లడించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్. నవంబర్ ఒకటి నుండి ప్రారంభం కానున్న షాపుల కు గానూ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని చెట్లల్ల కృష్ణయ్య ఫంక్షన్ హాల్ గార్డెన్ లో ఈరోజు నుండి వచ్చే 16వ తేదీ వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆయన వివరించారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు రెండు లక్షల ఫీజు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది. గతంలో ఫీజు మొత్తం లో ఎనిమిదవ వంతు ఆరు వాయిదాల్లో చెల్లించడం జరిగేది, అయితే నూతన పాలసీ ప్రకారం ఫీజు చెల్లింపు ఎనిమిది వాయిదాలకు పెంచినట్లు వివరించిన సూపరింటెండెంట్. బ్యాంక్ గ్యారెంటీని 50 శాతంకు తగ్గించారు. ఒక దరఖాస్తుదారుడు ఎన్ని షాపులకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ మొదటగా షాపు అలాట్మెంట్ అయిన తర్వాత మిగతా షాపులలో అతని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడం జరగదు. షాపుల కేటాయింపు ఈనెల 18వ తేదీన దరఖాస్తులు అందజేసిన కొంగరకలాన్ లోని చెట్లల్ల కృష్ణయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరుగుతుందని జనార్దన్ రెడ్డి తెలిపారు.. బైట్.. జనార్దన్ రెడ్డి. శంషాబాద్ అప్కరి సురేండెంట్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.