ETV Bharat / city

అమానుషం... మద్యం తాగించి మరీ కిరాతకం - undefined

వైద్యురాలి హత్యోదంతం మానవత్వానికే మాయని మచ్చలా మిగిలింది. అభం శుభం తెలియని యువతిని అతికిరాతంగా హతమార్చిన తీరు సగటు మనిషిని ఆందోళనకు గురిచేస్తోంది. మద్యం తాగించి... 45 నిమిషాల పాటు రాక్షసక్రీడ సాగించినట్లు తెలుస్తోంది. చివరికి మృతదేహాన్నీ వదలలేదనే విషయం అందరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

shadnagar incident in rangareddy district

author img

By

Published : Nov 30, 2019, 12:14 PM IST

వైద్యురాలిపై అఘాయిత్యం చేసే క్రమంలో దుర్మార్గులు పాశవికంగా ప్రవర్తించారు. 45 నిమిషాల పాటు అకృత్యానికి పాల్పడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దుండగులు బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడ్డారు.

ఆమె వేదన... అరణ్యరోదన!

బాధితురాలు తన స్కూటీ కోసం వేచిచూస్తున్న ప్రదేశం నుంచి మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు ‘హెల్ప్‌.. హెల్ప్‌..’ అని అరిచారు. వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఆమె వేదన అరణ్యరోదనే అయింది.

నోరు నొక్కి... లాక్కెళ్లారు

దుండగులు వైద్యురాలి నోరు నొక్కి లాక్కెళ్లారు. కొంతసేపటికే స్కూటీ తీసుకొచ్చిన శివ వారికి జత కలిశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమెపై లైంగికదాడి చేశారు. బాధితురాలు ప్రతిఘటించకుండా మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశారు. రాత్రి 10.20 గంటలవరకు ఈ రాక్షసకాండ కొనసాగించారు. అప్పటికే అచేతన స్థితిలోకి చేరుకున్న వైద్యురాలి నోరు, ముక్కును దుండగులు మూసేయడంతో ప్రాణాలు కోల్పోయింది.

మృతదేహంపై అఘాయిత్యం..?

సుమారు 30 నుంచి 45 నిమిషాలు నిందితులు వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసినట్లుగా పోలీసులు తేల్చారు. అంతటితో ఆగక నిందితులు మార్గమధ్యలో మృతదేహంపై పలుమార్లు దారుణానికి పాల్పడినట్లుగా తేల్చారు. ప్యాంటు లేకుండానే లారీ క్యాబిన్‌లోకి మృతదేహాన్ని ఎక్కించారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు మళ్లీ కిందకెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్లుగా గుర్తించారు. ఘటనాస్థలిలో పోలీసులు మృతురాలి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

కిరాతకుల్లో మైనర్‌ ఉన్నాడా..?

నిందితుల్లో మైనర్‌ ఉన్నారంటూ ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం నిందితులంతా 20 ఏళ్లకు పైబడిన వారేనని పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా చేయాలని, తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని మృతురాలి తండ్రి కోరుతున్నారు.నిందితుల తరఫున న్యాయవాదులెవరూ వాదించొద్దని ఆయన వేడుకుంటున్నారు.

సంబంధిత కథనాలు...

రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య

నా కొడుకు మంచోడు: మహ్మద్ పాషా తల్లి

Mumbai, Nov 30 (ANI): Bollywood actress Sunny Leone promoted a song from her upcoming project in a pub on November 29. She promoted her song 'Hello Ji' from 'Ragini MMS Returns Season 2'. She was seen wearing white top with silver metallic short skirt. Sunny was accompanied by her hubby Daniel Weber at the event in Mumbai.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.