ETV Bharat / city

'అమ్మఒడి' అవస్థలు.. కరెంటు ఆఫీసులకు జనం పరుగులు..! - ఏలూరు జిల్లా తాజా వార్తలు

AMMA VODI: అమ్మఒడి కోసం ఆశావహులు.. కరెంటు ఆఫీస్‌లకు క్యూ కడుతున్నారు. అమ్మఒడికి, కరెంట్‌ కార్యాలయాలకు లింకేంటని అనుకుంటున్నారా..? మరి ఏపీ ప్రభుత్వం పెట్టిన ఫిట్టింగ్‌ అలాంటింది. విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు దాటిందని కొందరికి, ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉన్నాయంటూ మరికొందరని అమ్మఒడి అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఫలితంగా వారంతా తప్పులు సరిదిద్దాలంటూ కరెంటు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

'అమ్మఒడి' అవస్థలు.. కరెంటు ఆఫీసులకు జనం పరుగులు..!

author img

By

Published : May 30, 2022, 8:34 PM IST

'అమ్మఒడి' అవస్థలు.. కరెంటు ఆఫీసులకు జనం పరుగులు..!

AMMA VODI: ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ కారణాలతో అమ్మఒడి జాబితా నుంచి అనేక మందిని తొలగించారు. దానికి గల కారణాలు చూసి అర్హులు అవాక్కవుతున్నారు. ప్రధానంగా విద్యుత్‌ వినియోగం, మీటర్లు ఎక్కువగా ఉన్నాయనే సాకులతో.. చాలా మందికి కోతవేశారు. అయితే.. వాస్తవ విరుద్ధంగా జాబితా రూపొందించారని.. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇల్లే లేకపోయినా.. కొందరి పేరిట విద్యుత్ కనెక్షన్ ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపుతోంది.

గ్రామ సచివాలయాలకు వెళ్తే విద్యుత్‌శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు తెచ్చుకోవాలని చెప్తున్నారు. చేసేదేమీలేక ఆశావహులు కరెంటు కార్యాలయంలో తిరుగుతున్నారు. పనులు మానుకుని, ఛార్జీలు పెట్టుకుని రావాల్సి వస్తోందని లబ్దిదారులు వాపోతున్నారు. గతంలో అమ్మఒడి తీసుకున్నవారిలో అనేక మంది పేర్లు ఈసారి జాబితాలో మాయం అయ్యాయి. ప్రభుత్వం భారం తగ్గించుకునేందుకు కావాలనే కొర్రీలు వేస్తోందని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గ్రామ సచివాలయాల్లోనే అభ్యంతరాలు పరిష్కరిస్తే మేలని.. కరెంటు కార్యాలయాల చుట్టూ తిరగడం పెద్ద ప్రహసనంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.