ETV Bharat / city

missing: ఒకేసారి ఏడుగురు విద్యార్థులు అదృశ్యం.. వారి లేఖలో ఏముందంటే..!

ఒకేసారి ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన బెంగళూరులో జరిగింది. తమకు చదవడం ఇష్టం లేదని.. ఆటలే కావాలని ఇంటి నుంచి పారిపోయారు.

students missing
students missing
author img

By

Published : Oct 12, 2021, 7:44 PM IST

ఒకేసారి ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏడుగురు విద్యార్థులు... చదవడం ఇష్టం లేదని, తమకు ఆటలు కావాలని ఇంటి నుంచి పారిపోయారు. బెంగళూరు బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని వెళ్లిన విద్యార్థులు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు ఓ లేఖ లభించింది. అందులో ‘మాకు చదువులంటే ఇష్టం లేదు. ఆటలంటేనే ప్రేమ అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా చదవాలని ఆసక్తి వారికి కలగట్లేదని లేఖలో వివరించారు.

క్రీడలే తమ కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మంచి పేరు, హోదా, డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి వస్తామని తెలిపారు. తమ కోసం ఆందోళన చెందొద్దని, ఎక్కడా వెతకొద్దని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: gas leak: కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్​.. 28మందికి అస్వస్థత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.