ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కుంభకోణంలో నలుగురు నిందితులను అనిశా అధికారులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఈఎస్ఐ మాజీ సంచాలకురాలు దేవికా రాణి సహా స్కాంలో కీలకంగా వ్యవహరించిన పద్మజ, రాధిక, వసంత ఇందిరల, శ్రీహరి, నాగరాజు, హర్షవర్ధన్‌ను విచారించనున్నారు.
ఇప్పటివరకు 13 మంది అరెస్ట్
ఈ కేసులో అనిశా... ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ఆరుగురిని 2 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారమే అనుమతి వచ్చినా.. దసరా సెలవులతో.. ఇవాళ కస్టడీకి తీసుకున్నారు.
విచారణ కోసం ప్రశ్నావళి సిద్ధం
కుంభకోణంలో ఇంకా ఎవరున్నారు.. ఎవరి వాటా ఎంత.. అనే అంశాలకు విచారణలో స్పష్టత వచ్చే అవకాశముంది. అనంతరం మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
- ఇదీ చూడండి : రెండురోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు