ETV Bharat / city

సెటిల్​మెంట్ చేసినా కేసు నుంచి తప్పించుకోలేరు: సుప్రీం

బ్యాంకు రుణాలను దారి మళ్లించి తర్వాత వన్​టైం సెటిల్​మెంట్ చేసినా క్రిమినల్ కేసు తప్పదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన క్యోరీ ఓరెమిన్ లిమిటెడ్ ఎండీ ఇషూ నారంగ్.. తీర్పుపై స్టే ఇవ్వాలని, ఈడీ కేసును కొట్టివేయాలని కోరగా సుప్రీం తిరస్కరించింది.

Settlement does not escape the case  orders by Supreme court
సెటిల్​మెంట్ చేసినా కేసు నుంచి తప్పించుకోలేరు: సుప్రీం
author img

By

Published : Feb 17, 2021, 3:08 PM IST

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారిమళ్లించి.. తర్వాత ఏకకాల పరిష్కారం (వన్​ టైం సెటిల్​మెంట్) పొందినంత మాత్రాన నిందితులు క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాదాపు రూ.200 కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని, తమపై ఉన్న ఈడీ కేసును కొట్టివేయాలంటూ క్యోరీ ఓరెమిన్ లిమిటెడ్ ఎండీ ఇషూ నారంగ్ సహా.. పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం విచారణ జరిపించింది.

సెటిల్​మెంట్ చేసుకోవడం క్రిమినల్ కేసు కొట్టివేయడానికి కారణం కాదని.. ఏదైనా విచారణలోనే తేలుతుందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి మేరకు హైకోర్టు తీర్పులో నిందితుల వివరాల్లో పేర్కొన్న ఫ్రాడ్, చీట్ అనే పదాలను తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈడీ కేసు కొట్టివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఇవీ చూడండి: రైలులో రూ.1.4 కోట్లు వదిలేసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.