ETV Bharat / city

సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్‌ వేటు - ap latest news

AB Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AB Venkateswara Rao
AB Venkateswara Rao
author img

By

Published : Jun 28, 2022, 11:50 PM IST

Updated : Jun 28, 2022, 11:57 PM IST

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో.. మే 19న సాధారణ పరిపాలనశాఖకు ఏబీవీ రిపోర్టు చేశారు. దీంతో ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి.విజయ్‌కుమార్‌ను రిలీవ్‌ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఏబీవీని నియమించింది. తాజాగా మరోసారి ఏబీవీని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కొన్ని నెలల క్రితం పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్‌ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. ఏబీవీ మీడియా సమావేశం నిర్వహించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ సీఎస్‌ సమీర్‌ శర్మ ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటూ నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రెస్‌మీట్‌ పెట్టడం తప్పేనని మెమోలో పేర్కొన్నారు. నోటీసు అందిన వారంలోపు వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని సీఎస్‌ హెచ్చరించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.