ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలో భాజపా సీనియర్ నేత ఆత్మారామ్ తోమర్(75) అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
"ఆత్మారామ్ తోమర్ గురువారం రాత్రి బిజ్రాల్ రోడ్డులోని తన ఇంట్లో శవమై కనిపించారు. అతని మృతదేహం ఉన్న గది బయట నుంచి లాక్ చేసి ఉంది. తోమర్‌ను సమీప బంధువులే హత్య చేశారని కుటుంబీకులు ఆరోపించారు."
-నీరజ్ జడౌన్, బాగ్‌పత్ ఎస్పీ
దర్యాప్తు కొనసాగుతోందని.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని బరౌత్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రవి రతన్ సింగ్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా సంచరించినట్లు పేర్కొన్నారు.
తోమర్ గతంలో వైదిక్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో ఛప్రౌలి నుంచి భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 1997లో భాజపా ప్రభుత్వంలో మంత్రి హోదాలో పనిచేశారు.
ఇదీ చూడండి: GANG RAPE: వేటకొడవళ్లతో బెదిరించి.. భర్తను కట్టేసి.. భార్యపై అత్యాచారం