ETV Bharat / city

మంటల్లో నుంచి బయటపడలేక పోతున్నాం.. చివరిసారిగా కుటుంబంతో సికింద్రాబాద్ ఘటన మృతులు - చివరిసారిగా కుటుంబంతో సికింద్రాబాద్ ఘటన మృతులు

secunderabad accident deceased last phone call : వారంతా వివిధ పనుల నిమిత్తం భాగ్యనగరానికి చేరుకున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు దగ్గరగా ఉండటంతో రూబీ హోటల్‌లో బస చేశారు. తెల్లవారితే ఎటు వాళ్లు అటు వెళ్లిపోయే వారే. ఇంతలో విధి పగపట్టింది. ఒక్క ప్రమాదంతో విగత జీవులుగా మారారు. చనిపోయే ముందు వారి వేదన అంతా ఇంతా కాదు.

secunderabad accident deceased last phone call

author img

By

Published : Sep 14, 2022, 9:56 AM IST

secunderabad accident deceased last phone call : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన ఎనిమిది మందిని బలితీసుకుంది. ఎనిమిది కుటుంబాల్లో విషాదం నింపింది. అయితే చనిపోయే ముందు కొందరు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టూ మంటలు అంటుకున్నాయని.. తాము బయట పడలేకపోతున్నాయని కుటుంబంతో చెప్పారు. ఈ విషయాలు తలచుకుంటూ గాంధీ వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి మృతదేహాలు తరలించడంతో వారి బంధువులు మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు.

సోదరుడికి ఫోన్‌ చేసిన పది నిమిషాల్లోనే.. మృతుల్లో ఆచీ మసాలా సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతోద్యోగులు ఉన్నారు. నారాయణస్వామి సీతారామన్‌(48) ఆడిటర్‌ కాగా, మరో ఉద్యోగి బాలాజీ (58) మార్కెటింగ్‌ మేనేజరు. ఇద్దరూ చెన్నైకు చెందిన వారే. కూకట్‌పల్లిలోని ఆచి మసాలా సంస్థ గోదాంలో ఆడిట్‌ అనంతరం లాడ్జిలో బస చేసినట్లు సీతారామన్‌ సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. పది నిమిషాల్లోనే మరోసారి ఫోన్‌ చేసి పొగ దట్టంగా వ్యాపించిందని..తాను ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెపి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం ఆయన సోదరుడు పోలీసుల దృష్టికి తెచ్చాడు.

స్నేహితుడికి సమాచారం ఇస్తూనే.. విజయవాడకు చెందిన హరీశ్‌(35).. ఈక్విడార్‌ బ్యాంకులో ఉద్యోగం రావడంతో మూడు రోజులశిక్షణ నిమిత్తం వచ్చి లాడ్జిలో బస చేశారు. తనతోపాటు వచ్చిన మరి కొందరికి పక్క లాడ్జి కేటాయించగా, హరీశ్‌కు రూబీలో గది ఇచ్చారు. రాత్రి తన స్నేహితుడికి ఫోన్‌ చేసి తానున్న లాడ్జిలో మంటలంటుకున్నాయని చెప్పాడు. తర్వాత ఫోన్‌ మూగబోయింది. హరీశ్‌ భార్య ఈ విషయం హైదరాబాద్‌లో ఉంటున్న హరీశ్‌ మరో స్నేహితుడికి చెప్పింది. అతను గాంధీకు వచ్చి చూడగా..అక్కడ విగత జీవిగా కనిపించాడు. వెంటనే సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. హరీశ్‌కు ఇంతకు ముందే కుమారుడు ఉండగా, భార్య కావ్య.. 16 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. విజయవాడ నుంచి గాంధీ ఆసుపత్రికి హరీశ్‌ నాన్న, బావ చేరుకొని, మృతదేహాన్ని విజయవాడకు తీసుకెళ్లారు.

బ్యూటీషియన్‌ శిక్షణలో భార్యకు తోడుగా వచ్చి.. వారిద్దరు దంపతులు. ఆమెకు బ్యూటీషియన్‌ శిక్షణ కోసం వచ్చారు. ఇనిస్టిట్యూట్‌కు దగ్గరలో ఉండటంతో రూబీ హోటల్‌లో బస చేశారు. శిక్షణ అనంతరం హోటల్‌ చేరుకున్నారు. ఇంతలోనే మంటలు.. దట్టమైన పొగలు వ్యాపించాయి. తమ ఇబ్బందులను కుటుంబ సభ్యులకు చివరిసారిగా చెప్పుకున్నారు. ఒడిశాకు చెందిన మిథాలి మహాపాత్ర(29), చందన్‌(30) దీనగాథ ఇది.

సదస్సుకు వచ్చి అన్నదమ్ములు మృతి.. దిల్లీకు చెందిన సందీప్‌ మాలిక్‌(52) రాజీవ్‌ మాలిక్‌(54) పశు సంవర్థక శాఖలో ఉద్యోగులు. ఓ సదస్సులో పాల్గొనటానికి వచ్చి రూబీలో బస చేశారు. అగ్ని ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తర్వాత ఎన్నిసార్లు కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా.. స్పందన రాలేదు. మీడియాలో వార్తలు చూసి పోలీసులను సంప్రదిస్తే.. విషయం తెలిసిందని వాపోయారు. మంగళవారం సాయంత్రం వారు గాంధీకి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను దిల్లీకు తరలించారు. ఇదే ఘటనలో మృతిచెందిన దిల్లీకు చెందిన వీరేందర్‌కుమార్‌ కూడా వ్యాపార పనిపై వచ్చి హాటల్‌లో ఉన్నాడు. కాసేపటికే భార్యకు ఫోన్‌ చేసి.. మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.