ETV Bharat / city

జేబీఎస్​-ఎంజీబీఎస్​ మార్గం ఎందుకు ప్రత్యేకం..

నగరవాసులు ఎంతగానో నిరీక్షస్తోన్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గం త్వరలో అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ట్రయల్ రన్​, భద్రతా తనిఖీలు, అనుమతులు కూడా పూర్తయ్యాయి. 7 నుంచి జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ వరకు మెట్రో రైలు పరుగులు తీయనుంది. దీంతో నగరవాసులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు సులువుగా చేరుకోవచ్చు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్​ మెట్రో మార్గం 69 కిలోమీటర్లకు విస్తరించినట్లవుతుంది.

second corridor in Hyderabad metro
జేబీఎస్​-ఎంజీబీఎస్​ మార్గం ఎందుకు ప్రత్యేకం..
author img

By

Published : Feb 5, 2020, 7:25 PM IST

జేబీఎస్​-ఎంజీబీఎస్​ మార్గం ఎందుకు ప్రత్యేకం..

భాగ్యనగర వాసులకు మరో మెట్రో రైలు కారిడార్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొదటి కారిడార్​ మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌, రెండో కారిడార్​ నాగోల్‌ నుంచి రాయదుర్గం మార్గాల్లో మెట్రో పరుగులు పెడుతోంది. ఈనెల 7న ముఖ్యమంత్రి కేసీఆర్​ జేబీఎస్‌ -ఎంజీబీఎస్‌ కారిడార్​కు పచ్చజెండా ఊపనున్నారు. ఫలితంగా 69 కిలోమీటర్ల మేర మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మార్గంలో 45 రోజులుగా ప్రయోగాత్మక పరుగు నిర్వహించారు.

తొమ్మిది స్టేషన్లు..

జేబీఎస్​- ఎంజీబీఎస్​ మెట్రో కారిడార్​ 11 కిలోమీటర్లు మేర ఉంటుంది. ఈ మార్గంలో 9 స్టేషన్లు ఉంటాయి. ప్రయోగాత్మక పరుగులో పలు రకాల పరీక్షలు చేపట్టారు. సిగ్నలింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమాచారాన్ని కెనడాలోని థాలెస్‌ సంస్థకు అందించారు. మెట్రో ఆటోమెటిక్‌గా నడిచే సీబీటీసీ సాంకేతికతను ఈ సంస్థ అందించింది.

రెండో కారిడార్‌.. మొదటి, మూడో మార్గాలను రెండు చోట్ల దాటుకుని వెళుతుంది. వైఎంసీఏ కూడలి గుండా నాగోల్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే మెట్రో వెళుతుంది. దీనిపై నుంచే జేబీఎస్‌ నుంచి వచ్చే మెట్రో ఎంజీబీఎస్‌ వైపు వెళుతుంది. ఈ రెండు కారిడార్లకు పరేడ్‌గ్రౌండ్‌ ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌. కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల పక్కనుంచి ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో మెట్రో పరుగులు పెడుతుంది. ఈ స్టేషన్​ మీదుగానే జేబీఎస్​ నుంచి ఎంజీబీఎస్‌కు మెట్రో చేరుకుంటుంది. ఈ రెండు కారిడార్లకు ఎంజీబీఎస్‌ ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌.

కీలక ప్రాంతాలు..

కోఠిలోనూ స్టేషన్లు సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడ కూడా కారిడార్లు మారొచ్చు. ఇది చిన్న మార్గమే అయినా కీలకమని మెట్రో అధికారులు అంటున్నారు. జూబ్లీ బస్‌స్టేషన్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, సుల్తాన్‌ బజార్‌, ఎంజీబీఎస్‌ ఉన్నాయని చెబుతున్నారు.

ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే.. నారాయణగూడ చుట్టుపక్కల ఉండే వారు జేబీఎస్‌ నుంచి పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్‌కు వెళ్లి అక్కడ నుంచి హైటెక్‌ సిటీకి చేరుకోవచ్చు. ఎల్​బీనగర్​ నుంచి సికింద్రాబాద్​ వెళ్లే వారు ఎంజీబీఎస్‌ వద్ద కారిడార్​ మారతే సులువుగా స్టేషన్​కు చేరుకోవచ్చిని తెలిపారు. దీంతో నగరవాసులు ఎక్కడ నుంచి ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు మార్గం సుగమం అవుతోందన్నారు.

సంక్రాంతి సమయానికే జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్​ను ప్రారంభించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పురపాలక ఎన్నికల కోడ్​ కారణంగా ప్రారంభం అలస్యమైంది. ఎన్నికలు, భద్రత తనిఖీలు, ట్రయల్​ రన్​ అన్ని పూర్తి చేసుకుని మెట్రో రెండో కారిడార్​ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. ఓల్డ్​ సిటీ మినహా.. మెట్రో ప్రాజెక్టు మొదటి దశ పూర్తయినట్లే...

ఇవీచూడండి: జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.