ఏపీలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో దశను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చింది.
గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా దానిలో మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి దశకు ఈనెల 29 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
పూర్తి వివరాలు..
- మొదటి దశ
నామినేషన్ల స్వీకరణ - జనవరి 29
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 9
- రెండో దశ
నామినేషన్ల స్వీకరణ - ఫిబ్రవరి 2
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 13
- మూడో దశ
నామినేషన్ల స్వీకరణ - ఫిబ్రవరి 6
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 17
- నాలుగో దశ
నామినేషన్ల స్వీకరణ - ఫిబ్రవరి 10
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 21
సంబంధిత కథనం: ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం