ETV Bharat / city

'150 పోలింగ్​ కేంద్రాల్లో ఫేస్​ రికగ్నిషన్​ సాఫ్ట్​వేర్​ వినియోగం'

author img

By

Published : Sep 29, 2020, 7:18 PM IST

గ్రేటర్ ఎన్నికల కోసం జోన్ల వారీగా కమిషనర్లు, సాంకేతిక నిపుణులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ఈరోజుతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్​ఈసీ పార్థసారథి... ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ-ఓటింగ్ కోసం ఐటీ శాఖతో కలిసి పనిచేస్తున్నామన్న ఎస్ఈసీ... మొత్తం దేశానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

sec parthasarathi training program
sec parthasarathi training program

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా డివిజన్​కు ఒకటి చొప్పున 150 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముఖకవళికలు గుర్తించేలా ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్​వేర్​ ఉపయోగించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం జోన్ల వారీగా కమిషనర్లు, సాంకేతిక నిపుణులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ఈరోజుతో ముగిసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఈసీ పార్థసారథి... కొవిడ్ మహమ్మారి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో సమర్థత పెరగడంమే కాకుండా ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని తెలిపారు.

ముఖకవళికలు గుర్తించే సాఫ్ట్​వేర్​ను గతంలో కొన్ని ఎన్నికల్లో వినియోగించగా మంచి ఫలితాలు వచ్చాయని, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఓటర్​ను గుర్తించవచ్చని పార్థసారథి చెప్పారు. సీనియర్ సిటిజెన్లు, దివ్యాంగులు, పోలింగ్ సిబ్బందికి ప్రయోగాత్మకంగా ఈ-ఓటింగ్ అమలు చేయనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఈ-ఓటింగ్ కోసం ఐటీ శాఖతో కలిసి పనిచేస్తున్నామన్న ఎస్ఈసీ... మొత్తం దేశానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

ఇదీ చూడండి: గ్రేటర్​లో మంచి పేరుంది.. కనీసం 91 సీట్లు గెలుస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.