ETV Bharat / city

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకుడిని నియమించిన ఎస్‌ఈసీ - గ్రేటర్ హైాదరాబాద్ వార్తలు

గ్రేటర్ హైదరాబాద్​ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నిర్వహించే ఎన్నిక కోసం పరిశీలకుణ్ని నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఐఏఎస్​ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకుడిని నియమించిన ఎస్‌ఈసీ

author img

By

Published : Feb 5, 2021, 4:38 PM IST

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఈ నెల 11న జరగనున్న ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకుణ్ని నియమించింది. ఐఏఎస్​ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా ఈ ఎన్నికకు పరిశీలకునిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 11వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ పాలకమండలిని ప్రత్యేకంగా సమావేశపరుస్తూ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్​ఈసీ.. ఏదైనా కారణాల వల్ల ఆ రోజు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు జరుగుతుందని తెలిపింది. ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఇప్పటికే నియమించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల ఎనిమిదో తేదీన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించనుంది.

ఇవీ చూడండి: 7న కేసీఆర్​ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.