ETV Bharat / city

ఈ ప్రయోగం వికటిస్తే.. భూమి జురాసిక్ పార్కే!! - జెనెటిక్ ఇంజనీరింగ్

ప్రయోగం ఏ రంగంలో చేసినా.. మెజారిటీ ఛాన్సెస్ ఫెయిల్యూర్​కే ఉంటాయి. కాబట్టి.. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ ప్రయోగం వ్యక్తికి సంబంధించినదైతే.. అతను మానసికంగా సిద్ధంగా ఉంటే సరిపోతుంది.. కానీ.. వ్యవస్థకు సంబంధించినదైతే..? మానవజాతి మనుగడకు సంబంధించినదైతే..?? ఆ ఎక్స్​పర్మెంట్ వికటించి పెను సవాలుగా మారితే..??? జెనిటిక్ ఇంజనీరింగ్ ద్వారా.. అంతరించిపోయిన జీవులకు మళ్లీ ప్రాణం పోసే పరిశోధనలు జరుగుతున్నాయి. తేడాకొడితే మాత్రం జురాసిక్ పార్క్ సినిమాను లైవ్ లో చూడొచ్చు. అందులో మీరూ ఓ క్యారెక్టర్ కావొచ్చు..!!

mammooth
mammooth
author img

By

Published : Oct 2, 2022, 6:47 PM IST

గడిచిన వేలాది సంవత్సరాల్లో.. ఈ భూమ్మీద నివసించిన ఎన్నో జీవులు అంతరించిపోయాయి. భారీ డైనోసార్ల నుంచి సూక్ష్మమైన ప్రాణుల దాకా ఈ లిస్టులో ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో కొన్ని జీవులను తిరిగి పుట్టించాలని సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రముఖమైన జీవి మమ్మూత్. ఇదొక ఏనుగు. అయితే.. ప్రస్తుతం ఉన్న ఏనుగు మాదిరిగా కాకుండా.. సింహంలాంటి జూలుతో ఉంటుంది. దంతాలు కూడా చాలా పొడవుగా ఉంటాయి. ఈ ఏనుగును తిరిగి సృష్టించి.. భూమ్మీద నడిపిచాలని చూస్తున్నారు సైంటిస్టులు.

మమ్మూత్
మమ్మూత్

ఈ మమ్మూత్​లు 5 మిలియన్ ఏళ్ల నుంచి 4,000 సంవత్సరాల మధ్య భూమ్మీద నివసించాయని అంచనా. ఈజిప్ట్ పిరమిడ్‌లు నిర్మించిన కాలంలో ఇవి అంతరించిపోయి ఉంటాయని భావిస్తున్నారు. వీటిని తిరిగి పుట్టించేందుకు అమెరికాలోని "కొలోసల్ బయోసైన్సెస్" అనే సంస్థ ఈ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇందుకోసం.. పీటర్ థీల్, టోనీ రాబిన్స్, పారిస్ హిల్టన్, వింక్లెవోస్ తదితరులు పెట్టుబడిదారులుగా ఉన్నట్లు న్యూస్ వీక్ అనే సంస్థ తెలిపింది.

జెనెటిక్ ఇంజనీరింగ్
జెనెటిక్ ఇంజనీరింగ్

మరి, ఎలా సృష్టిస్తారంటే.. జెనిటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇలాంటి జీవులను తిరిగి సృష్టిస్తారు. అంటే.. ఏ జంతువునైతే పుట్టించాలని చూస్తున్నారో.. దానికి దగ్గరగా ఉండే జంతువుల్లోకి.. అంతరించిపోయిన జీవి DNAను ప్రవేశపెట్టి.. పలు రకాల ప్రయోగాలు.. దశలవారీగా కొనసాగించడం ద్వారా పాత జీవిని సృష్టిస్తారు. ఇప్పటికే.. మమ్మూత్ ఎముకల నుంచి DNA సేకరించి.. దాని జన్యువును కూడా డీకోడ్ చేసినట్టు సమాచారం. CRISPR (క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్) జన్యు సవరణను ఉపయోగించి, పరిశోధకులు మమ్మూత్​తోపాటు టాస్మానియన్ పులుల వంటి పలు జీవులను తిరిగి సృష్టించాలని చూస్తున్నారు. ఆర్కిటిక్ మంచు ఖండంలో వాతావరణం సాధారణ స్థితికి వచ్చేందుకు ఇవి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

మమ్మూత్ అస్థిపంజరం
మమ్మూత్ అస్థిపంజరం

ఇదంతా.. ప్రయోగం సక్సెస్ అయితే జరిగేది. మరి.. విఫలమైతే పరిస్థితి ఏంటి? అనే టెన్షన్ కూడా ఉంది. ఖచ్చితంగా అనుకున్న జంతువు కాకుండా.. మరో వింత జంతువు.. ప్రమాదకరమైన జీవులు ఉద్భవించే అవకాశం కూడా ఉండొచ్చనే ఆందోళ ఉంది. ఇవి పర్యావరణానికి హాని కలిగించడంతోపాటు.. మానవజాతికి ప్రమాదకరంగా మారే అవకాశాన్నీ కొట్టిపారేయలేం అనే వారు కూడా ఉన్నారు. మరి, దీనిపై మీరేమంటారు?

టాస్మానియన్ టైగర్
టాస్మానియన్ టైగర్

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.