ETV Bharat / city

స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు - గోల్కొండలో స్వాతంత్ర్య వేడుకలు

Independence Day Celebrations రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. గోల్కొండలో పంద్రాగస్టు ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి సీఎస్​ సోమేశ్‌కుమార్‌ అధికారులతో కలసి పరిశీలించారు.

SC somesh kumar inspected independence day celebration arrangements in golkonda

author img

By

Published : Aug 13, 2022, 4:39 PM IST

Independence Day Celebrations: రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టు వేళ జరిగే వేడుకల కోసం చారిత్రక గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా పోలీసులు, అధికార యంత్రాంగం రిహార్సల్స్‌ చేస్తున్నారు. గోల్కొండలో పంద్రాగస్టు ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి సీఎస్​ సోమేశ్‌కుమార్‌ అధికారులతో కలసి పరిశీలించారు. పోలీస్‌, వైద్యారోగ్యశాఖలతో పాటు జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి.. ఏర్పాట్లను సీఎస్​ పర్యవేక్షించారు.

15న ఉదయం పదిన్నరకు ముఖ్యమంత్రి గోల్కొండలో జాతీయ పతాకావిష్కరణ చేసి.. పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా వెయ్యిమంది కళాకారులతో సీఎంకు స్వాగతం పలుకనున్నారు. పతాకావిష్కరణ అనంతరం.. పోలీస్ దళాలు రాష్ట్రీయ సైల్యూట్‌ను అందిస్తాయి. కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లను జారీచేసింది. అక్కడికి వచ్చిన వారందరూ కార్యక్రమాన్ని వీక్షీంచేందుకు వీలుగా ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల కోసం గోల్కొండకు వచ్చే వారికి మంచినీటి సౌకర్యం, వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు అందుబాటులో ఉంచనున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.