పాతబస్తీ మరో కశ్మీర్‌లా మారే ప్రమాదం ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పాతబస్తీలో నివసిస్తున్న హరిజనులను అక్కడి నుంచి తరమి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో దళితులపై జరుగుతున్న దాడులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఎస్సీ కమిషన్ నిర్వహించిన సమీక్షకు నగర పోలీసు కమిషనర్ రాకపోవడం ఎస్సీలను అవమానించడమే అని వ్యాఖ్యానించారు.
పాతబస్తీపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే బలాల, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే డీజీపీ, సీపీలను దిల్లీకి పిలిపించి విచారణ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలోని చాలా పోలీసు స్టేషన్‌లలో ఎస్సీ, ఎస్టీ కేసులు పెడితే తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: ఆకాశంలో అద్భుతం.. భానుడి చుట్టూ వలయాకారం