సంక్రాంతి వస్తే పల్లెకు ప్రాణం వస్తుంది. పిండి వంటలు, కొత్త బట్టలు, ధాన్యపురాసులు, బంధువుల సందడి.. ఇలా ప్రతి అంశం కొత్త శోభ తీసుకొస్తాయి. వలస వెళ్లిన జనాలతో ఒంటరితనం అనుభవించే గ్రామాలు.. పండుగకు మాత్రం మురిసిపోతాయి.
మూడు రోజులు జరిగే వేడుక ఒక ఎత్తైతే.. ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పందేలు మరో ఎత్తు. వీటి ప్రత్యేకత వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఆటలో రెండు కోళ్లు తలపడుతుంటే పక్కనే ఉన్న జనం చప్పట్లతో ఉత్సాహపరుస్తుంటారు. అలాంటి కోళ్లు రెండు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం...
ఇదీ చదవండి: ఇరాన్లో ఘోర ప్రమాదం- 180 మందితో వెళ్తూ కూలిన విమానం