సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జమిలీ ఎన్నికలు వచ్చాయంటే కాలేజీ ఏర్పాటు మళ్లీ వాయిదా పడుతుందని పేర్కొన్నారు.
సీఎం పదవిపై ప్రచారం జరుగుతోందని.. ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మెడికల్ కాలేజీ పంచాయితీ మొదటికి వస్తుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సీఎంగా కేసీఆర్ కుర్చీ దిగబోయే నాటికి కాలేజీకి శంకుస్థాపన చేయాలని కోరారు.
ఇదీ చూడండి: అంగడిపేట ప్రమాద ఘటనలో మరొకరు మృతి