ఏపీలో ఇసుక కొనుగోలుదారులను మరింత పిండుకుంటున్నారు(sand charges in andhrapradesh news). ధర ఎక్కువ ఉందని ఇప్పటికే గగ్గోలు పెడుతున్న తరుణంలో లోడింగ్, బాట ఖర్చులంటూ వడ్డిస్తున్నారు(extra loading charges on sand news). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ధరతోపాటు ఈ భారం అదనంగా మారింది. ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఏడాది మే14 నుంచి చేపట్టింది. రేవులో టన్ను రూ.475 చొప్పున విక్రయించాల్సి ఉంది. వరదల కారణంగా ప్రధాన నదుల్లో తవ్వకాలు ఆపేశారు. నిల్వ కేంద్రాలు, డిపోల్లో నిల్వచేసిన ఇసుకను విక్రయిస్తున్నారు. రేవునుంచి నిల్వ కేంద్రం ఎంత దూరముందో ఆ మేరకు రవాణా ఖర్చుతో కలిపి జిల్లా అధికారులు నిర్ణయించిన ధర ప్రకారం విక్రయించాలి. కానీ వీటిలోనూ కొన్ని చోట్ల వ్యత్యాసం ఉంటోందనే ఆరోపణలున్నాయి. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద ఏర్పాటుచేసిన నిల్వ కేంద్రంలో మట్టితో కూడిన నాణ్యతలేని ఇసుకను టన్ను రూ.650కి విక్రయిస్తున్నారు. అక్కడే నాణ్యమైన ఇసుకను టన్ను రూ.830 చొప్పున ఇస్తున్నారు. అయితే 1, 2 లోడ్లు తీసుకునే సామాన్యులకు నాణ్యతలేని ఇసుక ఇస్తున్నారని.. ఎక్కువ లోడ్లు తీసుకునే గుత్తేదారులకు మాత్రమే నాణ్యమైన ఇసుక అమ్ముతున్నారని కొందరు లారీల యజమానులు పేర్కొంటున్నారు. ఒకేచోట 2 రకాల ధరలతో ఇసుక విక్రయాలపై విమర్శలున్నాయి.
- గోదావరిలో వరద కారణంగా పశ్చిమగోదావరిలో నదికి ఆనుకొని 1,2 కి.మీ. దూరంలో ఉన్న యార్డుల వద్ద విక్రయిస్తున్నారు. అయితే పెండ్యాల, పందలపర్రు, పీపర్రు యార్డుల వద్ద అసలు ధరకంటే రూ.100-150 అదనంగా తీసుకుంటున్నారు. లోడింగ్ కోసమని అక్కడివారు చెబుతున్నారు. వాస్తవానికి లోడింగ్‌ఛార్జితో కలిపే రూ.475కి విక్రయించాల్సి ఉంది. అదనపు ధరపై ఇటీవల లారీల యజమానులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా.. 4రోజులు వాటిని తీసుకోలేదు. తర్వాత మళ్లీ యథావిధిగా అదనంగా తీసుకుంటున్నారని ఓ లారీ యజమాని తెలిపారు.
- తూర్పుగోదావరి రావులపాలెం వద్ద డిపోలో బాటఛార్జిల పేరిట ట్రిప్పునకు రూ.600 చొప్పున ఇతరుల ద్వారా వసూలు చేయిస్తున్నారు.
- పడవల సొసైటీల ఇసుకకు టన్ను ధర రూ.625గా నిర్ణయించారు. కొన్ని పడవల ర్యాంపుల వద్ద బాటఛార్జిల కింద ప్రతి ట్రిప్‌లో రూ.200-300 వసూలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ఏమైంది?
జేపీ సంస్థ బాధ్యతలు చేపట్టి ఐదు నెలలవుతున్నా.. ఇప్పటివరకు ఎంత తవ్వకాలు, విక్రయాలు చేస్తోందనే లెక్కలు పక్కాగా లేవు. విక్రయించే ప్రతి టన్నుకు లెక్క ఉండేలా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశామని ఆగస్టు మొదటి వారంలో అధికారులు చెప్పారు. అయినాసరే ఇప్పటివరకు అమలు చేయనందున జేపీ సంస్థ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
- రేవుల్లో ఇసుక తవ్వాక.. వరద వచ్చి మళ్లీ ఇసుక చేరుతోంది. తవ్వకాలపై గనుల శాఖ అధికారులు తనిఖీ చేయడం లేదు. దీంతో వరదకు ముందు రేవులో ఎంత తవ్వారనే లెక్క ఉండటం లేదు.
- అత్యధిక రేవులు, నిల్వ కేంద్రాల వద్ద తూకాలు లేవు. అంచనా మేరకు వాహనాల్లో ఇసుక నింపుతున్నారు.
ఇదీ చదవండి: