హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కి చెందిన వేణు తొమ్మిదేళ్లుగా ఇసుకతో ఆర్ట్ వేస్తున్నాడు. పలు అంశాల మీద గతంలో శాండ్ ఆర్ట్ వేసిన వేణు తాజాగా కరోనాపై అవగాహన కల్పిస్తూ... శాండ్ ఆర్ట్ వేసి ఆలోచింపజేస్తున్నాడు. ప్రపంచం మీద కరోనా ఎలా దాడి చేస్తున్నది.. అప్రమత్తంగా లేకపోతే ఎంత నష్టమో అర్థమయ్యేలా ఇసుకతో ఆర్ట్ రూపొందించాడు. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి.. చేతులు కడుక్కోండి.. మాస్కు ధరించండి అంటూ శాండ్ ఆర్ట్‌తో అర్థమయ్యేలా చెప్పాడు.
గతంలో బతుకమ్మ, బోనాలు, తెలంగాణ సంస్కృతి, బాహుబలి, సైరా వంటి అంశాల మీద కూడా శాండ్ ఆర్ట్ వేసి ఆకట్టుకున్నాడు. తాజాగా కరోనా మీద వేసిన శాండ్ ఆర్ట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఎంపీ సంతోష్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో జత చేశారు.
ఇవీ చూడండి: కాబోయే అమ్మలూ.. కరోనా ముప్పు తప్పించుకోండిలా!