ETV Bharat / city

నాగచైతన్య-సమంత విడిపోతున్నారా.. నిజమెంత? - విడాకులు

అక్కినేని జోడీ నాగచైతన్య-సమంత(Samantha Naga Chaitanya) గురించి కొంతకాలంగా పలు వార్తలు వస్తున్నాయి. ఈ హిట్​ జోడి ఫట్ అవుతుందని.. వారిద్దరు విడిపోతారని.. కోట్ల కొద్దీ భరణం చెల్లించనున్నారని ఇలా ఎన్నో వార్తలు వైరల్​ అవుతున్నాయి. దీంతో చై- సామ్​ జోడీ టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది.

Samantha Naga Chaitanya
Samantha Naga Chaitanya
author img

By

Published : Sep 23, 2021, 5:47 PM IST

నాగచైతన్య- సమంత మధ్య ఏం జరుగుతోంది అనేది పెద్ద హాట్​ టాపిక్​గా మారిపోయింది. వారి మధ్య నిజంగానే వివాదాలు నడుస్తున్నాయా? అవి విడాకులకు దారి తీస్తాయా అనేది అభిమానులకు పెద్ద ప్రశ్న. అయితే ఎన్ని రూమర్లు వస్తున్నప్పటికీ వారు ఈ విషయంపై స్పందించకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

2017లో హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. అనంతరం తన సోషల్​మీడియా అకౌంట్లలో సమంత పక్కన 'అక్కినేని' పదాన్ని జోడించింది. కానీ అకస్మాతుగా ట్విట్టర్​, ఇన్​స్టా నుంచి అక్కినేని పదాన్ని తొలగించి ఎస్​ అక్షరం పెట్టుకోవడంపై సర్వత్రా చర్చ మొదలైంది. 'సామ్​ ఎందుకిలా చేసింది?' అంటూ మాట్లాడుకుంటున్నారు. అసలు వివాదం అక్కడే మొదలైందా? అనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ అంశంపై స్పందించిన సమంత.. 'అనవసర విషయాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని' కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం అభిమానులను మరింత సందిగ్ధంలో పడేసింది.

ఈ మధ్య నాగచైతన్య నటించిన 'లవ్ ​స్టోరీ' సినిమా ట్రైలర్​(love story movie trailer) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే చైతూ ట్వీట్‌ని షేర్ చేస్తూ విన్నర్ అంటూ.. చిత్ర బృందానికి, సాయి పల్లవికి సమంత కంగ్రాట్స్ చెప్పడం.. 'థ్యాంక్స్​ సామ్​' అంటూ.. చైతూ రిప్లే ఇవ్వడంతో వీరి మధ్య వివాదాలేవీ లేవని పలువురు మాట్లాడుకున్నారు.

ఇటీవల సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య-సమంత విషయంలో వస్తున్న రూమర్స్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా సామ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో మళ్లీ వీరి మధ్య ఏదో జరుగుతోంది అనే అంశం తెరపైకి వచ్చింది.

సామ్​, చై వ్యవహారంపై రోజు రోజుకూ సామాజిక మాధ్యమాల్లో గాసిప్స్​ పెరుగుతున్నప్పటికీ.. ఇంతకీ వీరి మధ్య ఏం జరుగుతోంది అనే విషయంపై ఎవరూ నోరు మెదపకపోవడం గమనార్హం. వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తే.. అసలు విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: రూమర్స్​పై ప్రశ్న.. విలేకరికి సమంత ఘాటు రిప్లై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.