ETV Bharat / city

tirumala: తితిదేలో ఆ సిబ్బందికి జీతాలు నిలుపుదల.. కారణమిదే.! - తితిదే సిబ్బందికి వ్యాక్సినేషన్

ఏపీలో కరోనా టీకా వేసుకోని తితిదే సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని తితిదే ఈవో జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఇవ్వాలని నోట్​లో పొందుపరిచారు.

salaries stop to ttd staff
తితిదే సిబ్బంది జీతాలు నిలుపుదల
author img

By

Published : Jul 1, 2021, 2:03 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా టీకా వేసుకోని తితిదే(TTD) సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని తితిదే ఈవో జవహర్‌ రెడ్డి (TTD EO Jawahar reddy) ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్​ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని పలుమార్లు సూచించినా కొందరు నిర్లక్ష్యం చేశారని.. అటువంటి వారికి జూన్ నెల జీతాలు ఆపాలని అన్ని విభాగాల హెచ్​వోడీలకు ఆయన నోట్ పంపించారు.

ఫ్రంట్ లైన్ సిబ్బందితో పాటు, 45 ఏళ్లకు పైన ఉన్న వాళ్లు వ్యాక్సిన్ వేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఇవ్వాలని నోట్​లో పొందుపరిచారు. టీకా వేసుకున్నట్లు నిర్ధరించిన తర్వాత... మళ్లీ సప్లిమెంటరీ బిల్లులను 8న పంపించాలని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బంది బిల్లులను మాత్రం వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: Harish Rao: చెత్తను ఆదాయ వనరుగా మారుస్తాం... గ్యాస్​ తయారు చేస్తాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.