ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala comments on power crisis news). భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావొచ్చని స్పష్టం చేశారు. ఇళ్లలో కరెంట్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-8 గంటల మధ్య విద్యుత్ వాడకం తగ్గించాలన్న ఆయన.. బొగ్గు కొరత, ధర పెరగడం వల్ల ఈ సమస్య వచ్చిందని వివరించారు. డబ్బు వెచ్చించినా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. విద్యుత్ అంశంపై కేంద్రమంత్రి చెప్పింది అవాస్తవమన్న సజ్జల.. ముఖ్యమంత్రి జగన్(cm jagan letter to pm modi news) ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
శరాఘాతంలా హైకోర్టు తీర్పు
ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు తీర్పుపై సజ్జల (sajjala ramakrishna reddy news) స్పందించారు. ఇళ్ల స్థలాల పేరుతో లబ్ధిదారులకు తెలియకుండా కొందరు కేసులు వేశారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు(ap high court stay on house site distribution programme news) శరాఘాతంలా మారిందని వ్యాఖ్యానించారు. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని తెదేపా అడ్డుకుంటోందన్న సజ్జల.. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయస్థాయి నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
'ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారింది. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని తెదేపా అడ్డుకుంటోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు వెళ్తాం.డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశం ఉంది. జాతీయస్థాయి నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మిస్తున్నాం' - సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు
ఇదీ చదవండి: AP HIGH COURT: ఇళ్ల నిర్మాణంపై డివిజన్ బెంచ్‌లోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ