ETV Bharat / city

Sabarimala special trains : అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లు - Sabarimala

Sabarimala special trains 2021-2022 : అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త చెప్పింది. శబరిమలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నందున అక్కడికి వెళ్లేందుకు 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. జనవరి 3 నుంచి 16 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయ్యప్ప భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

శబరిమలకు ప్రత్యేక రైళ్లు, Sabarimala special trains
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Dec 24, 2021, 7:40 AM IST

Sabarimala special trains 2021-2022 : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి బాగా ఉంది. రోజూ వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇప్పటికే ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లలో భారీగా వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. ఈ నేపథ్యంలో మరో 28 ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

జనవరి 3 నుంచి 16 వరకు..

Special Trains to Sabarimala : ఇవి జోన్‌ పరిధిలోని కాచిగూడ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాందేడ్‌ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లం రైల్వేస్టేషన్‌కు.. అక్కడినుంచి ఈ స్టేషన్లకు నడుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 3 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రైళ్లలో సెకండ్‌, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌తో పాటు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు ఉంటాయని, అన్ని బోగీల్ని రిజర్వేషన్‌తో నడిపించనున్నట్లు ద.మ.రైల్వే పేర్కొంది. అయ్యప్ప భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మెము రైలు నంబరు మార్పు

Special Trains to Sabarimala 2022 : కాచిగూడ-మిర్యాలగూడ మెము రైలుని డిసెంబరు 31 వరకు 07274 నంబరుతో నడిపిస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ రైళ్లు జనవరి 1వ తేదీ నుంచి 07276/07974 నంబర్లతో నడుస్తాయని పేర్కొంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.