Sabarimala Special Trains 2021 : భక్తుల కోసం నేటి నుంచి శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లు జోన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ స్టేషన్ల నుంచి ప్రారంభమై మార్గమధ్యలో అనేక స్టేషన్లలో ఆగుతాయని ద.మ.రైల్వే తెలిపింది. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులు రైల్వే శాఖతో సహకరించాలని కోరింది.
Special Trains to Sabarimala : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ప్రత్యేక రైళ్లలో హారతి వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ‘రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను తీసుకెళ్లడం, ఏ రూపంలోనైనా అగ్నిని వెలిగించడంపై నిషేధం ఉంది. అతిక్రమిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.1,000 జరిమానా లేదా రెండు శిక్షలూ ఉంటాయి. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారికి రైల్వే చట్టం -1989లోని సెక్షన్ 67,154,164,165 క్రింద శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తాం. రైలు ప్రయాణికులు స్టేషన్లలో ఉన్నప్పుడు, రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికుల భద్రత కోసం కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.' అని ద.మ. రైల్వే తెలిపింది. ఈ మేరకు భక్తులు జాగ్రత్తలు పాటించాలని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ కోరారు.