ఎండనకా.. వాననకా.. అందరి భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. ట్రాఫిక్ నియమాలు పాటించటమే వారికి మనమిచ్చే అసలైన గౌరవమని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నక్లెస్ రోడ్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వర్చువల్ రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి... జెండా ఊపి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని... చిన్నపిల్లలకు తల్లిందండ్రులు వాహనాల ఇవ్వొద్దని కోరారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. ఈ వర్చువల్ రన్లో కమిషనరేట్ పరిధిలోని 50 ఠాణాల పోలీసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.