APSRTC Employees Strike: ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీవ్యాప్తంగా సమ్మెకు దిగేందుకు ఆ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. సమ్మెకు సన్నాహకంగా రేపు, ఎల్లుండి అన్ని డిపోల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సహా భవిష్యత్ పోరాట కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలని సంఘ నేతలు.. ఉద్యోగులకు ఆదేశాలిచ్చారు.
పీఆర్సీకి నిరసనగా రేపు , ఎల్లుండి ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని తీర్మానించారు. అన్ని డిపోల్లో ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొనాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి టీ, భోజన విరామంలో డిపోల్లో భారీగా ధర్నాలు నిర్వహించబోతున్నారు. విలీనం అనంతరం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలను ధర్నాల్లో చర్చించాలని నిర్ణయించారు. హాజరైన సిబ్బందికి సమ్మె చేయాల్సిన ఆవశ్యకతను వివరించాలన్నారు. యూనియన్ల జెండాలు, బ్యానర్ల స్థానంలో ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక బ్యానర్లు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: