ETV Bharat / city

ప్రభుత్వ తీరుకు నిరసనగా అశ్వత్థామ రెడ్డి ఒక్కరోజు నిరాహార దీక్ష - Ashwathama Reddy hunger strike

ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పాలిట ఉరితాడుగా మారిన ఉద్యోగ భద్రత సర్క్యులర్​ను వెంటనే ఉపసంహరించాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ashwathama-reddy
ashwathama-reddy
author img

By

Published : Mar 5, 2021, 10:03 AM IST

2019 నుంచి 2021వరకు రావాల్సిన నాలుగు విడతల డీఏను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

సీసీఎస్​కు చెల్లించాల్సిన సుమారు రూ.850 కోట్ల బకాయిలు చెల్లించాలని అశ్వత్థామ డిమాండ్ చేశారు. యూనియన్లను రద్దు చేసి సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేస్తామని చేసిన ప్రభుత్వ ప్రకటన నేటికీ అమలుకు నోచుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు.

ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పాలిట శాపంగా మారిన ఉద్యోగ భద్రత సర్క్యులర్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్ధృత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో యూనియన్ నాయకులు తిరుపతి, శంకర్, సోమయ్య, నిరంజన్, వీకే రెడ్డి, మహిళా నాయకులు, శారద, పద్మలత, శ్రీదేవి, కౌసల్య పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.