విజయదశమి పర్వదినాన కళకళలాడాల్సిన బస్స్టేషన్లు వెలవెలబోతున్నాయి. కరోనా వ్యాప్తి భయంతో ప్రయాణికులు రాకపోవడం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరకపోవడం వంటి సమస్యలతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
సాధారణ సమయాల్లో గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ నుంచి రోజుకు 74 బస్సులు తిరుగుతుండగా.. ప్రస్తుతం ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకుండా పోయింది. ప్రయాణికులు కార్లను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు నేరుగా పరిస్థితుల్లో.. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన దాచేపల్లి మండలం వాడపల్లి, మాచర్ల సమీపంలోని విజయపురి సౌత్ వరకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. మంగళవారం రెండు రాష్ట్రాల ప్రతినిధుల చర్చల తర్వాత మళ్లీ ఆర్టీసీ ఆంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయనేది స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇవీచూడండి: లైవ్ వీడియో: డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కార్ల పైకి దూసుకెళ్లిన ట్రక్కు