Sajjanar travelled in bus: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు తన మార్కు ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. ఆ సంస్థ అభ్యున్నతి కోసం సజ్జనార్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీపై ప్రజల్లో ఇప్పటికే ఉన్న అపోహలను తొలగించి మరింత ఆదరణ తీసుకొచ్చేలా తానే స్వయంగా రంగంలోకి దిగి.. ప్రగతి రథాలను పరుగులు పెట్టిస్తున్నారు. అప్పుడప్పుడు స్వయంగా బస్సు ప్రయాణం చేస్తూ.. ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తున్నారు.
-
As part of #tsrtcbusday initiative, travelled to work in #TSRTC bus.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
To improve the quality of our services & to have personal feedback from passengers,every #ThursdayMorning our staff working in #TSRTC shall travel only by our buses.Share your pics while you plying in #TSRTCBus pic.twitter.com/gAqvkkdW3j
">As part of #tsrtcbusday initiative, travelled to work in #TSRTC bus.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 9, 2021
To improve the quality of our services & to have personal feedback from passengers,every #ThursdayMorning our staff working in #TSRTC shall travel only by our buses.Share your pics while you plying in #TSRTCBus pic.twitter.com/gAqvkkdW3jAs part of #tsrtcbusday initiative, travelled to work in #TSRTC bus.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 9, 2021
To improve the quality of our services & to have personal feedback from passengers,every #ThursdayMorning our staff working in #TSRTC shall travel only by our buses.Share your pics while you plying in #TSRTCBus pic.twitter.com/gAqvkkdW3j
tsrtc bus day: ఆర్టీసీ సంస్థకు సంబంధించిన పరిపాలన విభాగపు అధికారులు, ఉద్యోగులు ప్రతి గురువారం 'బస్‌డే'గా పాటించి అందరూ బస్సులలోనే ప్రయాణించాలని ఇటీవలే సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయననే స్వయంగా బస్సులో ప్రయాణించి మిగతా ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. గురువారం సందర్భంగా బస్‌డే పాటించిన సజ్జనార్.. తన నివాసం నుంచి లక్డీకాపూల్ మీదుగా టెలిఫోన్‌భవన్ వరకు కాలినడకన వచ్చారు. అక్కడి బస్‌స్టాప్‌లో కాసేపు సమయం గడిపారు. తానెవరో తెలియకుండా బస్‌స్టాప్‌లో తనతోపాటు ఉన్న ప్రయాణికులతో మాటకలిపారు. బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన పని తీరు, బస్సులలో శుభ్రత, కార్గో సేవలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
rtc md sajjanar bus travelling: అనంతరం అక్కడికి వచ్చిన మెహదీపట్నం డిపోకు చెందిన రూట్ నెంబర్ 113 ఐఎం బస్సెక్కారు. స్వయంగా టికెట్టు కొనుక్కొని బస్‌భవన్ వరకు ప్రయాణించారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సంస్థ అభ్యున్నతికి తమవంతు సహకారం అందించాలని ప్రజలకు, ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
Sajjanar latest news: ఇప్పటికే పలుమార్లు బస్సు ప్రయాణం చేసిన సజ్జనార్.. ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో తెలియజేస్తూనే ఉన్నారు. కుటుంబసభ్యులతో కూడా సజ్జనార్ ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసి.. సేవలలో సమస్యలు తెలుసుకుంటూ సామాన్యులను ఆర్టీసీవైపు ఆకర్షిస్తున్నారు. ఆర్టీసీని కించపరిచేలా వచ్చిన యాడ్‌ను మార్పించి.. సంస్థ స్థాయి దిగజారనీయకుండా తగు చర్యలు తీసుకున్నారు. పండగలకు టికెట్ రేట్లు పెంచకుండా.. ప్రయాణికులంతా ఆర్టీసీనే ఆశ్రయించేలా ఆకర్షించారు. ఆర్టీసీ సేవల విషయంలో సామాన్యులు చేస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉన్నామన్న నమ్మకాన్ని ఇస్తున్నారు. ఇలా.. ఏ సందర్భమైనా సంస్థను అభివృద్ధి బాటలో నడిపించటమే లక్ష్యంగా సజ్జనార్ అడుగులు వేస్తున్నారు.
సంబంధిత కథనాలు..
- Rtc Md Sajjanar: సాధారణ ప్రయాణికుడిగా మారి... సాధకబాధలు విని..
- Rtc Md Sajjanar: పుష్పక్ బస్‌లో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- Sajjanar traveled in tsrtc bus: మరోసారి... ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్
- Rtc Md Sajjanar Visit: ఆర్టీసీ బస్సులో సజ్జనార్.. ప్రయాణికులతో ముచ్చట.. ట్వీట్ చేయాలంటూ...
- Sajjanar: కుటుంబసమేతంగా సజ్జనార్ సందడే సందడి.. వీడియో వైరల్!