హైదరాబాద్ పాతబస్తీలోని ఫారుఖ్‌నగర్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధూంధాం, వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ రాజిరెడ్డి హాజరయ్యారు. హైకోర్టు సూచించినా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దారుణమన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకు పెట్టైనా మిగిలిన సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే కార్మికులు బలి అవుతున్నారని రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతునివ్వాలని కోరారు. తాత్కాలిక సిబ్బంది విధులకు హాజరవ్వకుండా.. సంఘీభావం తెలపాలని విజ్ఞప్తిచేశారు.
ఇవీచూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా