ETV Bharat / city

ఆర్టీసీ కార్గో-పార్శిల్​ సేవల్లో తెలంగాణ ముందడుగు : పువ్వాడ

author img

By

Published : Dec 10, 2020, 12:08 PM IST

Updated : Dec 10, 2020, 2:23 PM IST

ఆర్టీసీ కార్గో-పార్శిల్ సేవల్లో తెలంగాణ మరో అడుగు ముందుకేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా మూడు నెలలపాటు హైదరాబాద్​లో ఇంటికే పార్శిళ్లు పంపిణీ చేసే సేవలను కొనసాగించనున్నట్లు తెలిపారు.

Telangana RTC
ఆర్టీసీ కార్గో-పార్శిల్​ సేవల్లో తెలంగాణ ముందడుగు

ఆర్టీసీ కార్గో-పార్శిల్ సేవల్లో రాష్ట్రం మరో అడుగు ముందుకేసిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇక నుంచి నేరుగా వినియోగదారుని ఇంటికే పార్శిళ్లు అందజేస్తామని తెలిపారు. ఖైరతాబాద్​లో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిన మంత్రి.. ఎలాంటి అదనపు భారం లేకుండా కార్గో-పార్శిల్ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.

డోర్​-టూ-డోర్​ సేవల కోసం 3 సంస్థలను ఎంపిక చేసిన అధికారులు.. నగరాన్ని 3 సెక్టార్లుగా విభజించి సేవలు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. కూకట్‌పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ సెంటర్లుగా చేసి ఏజెన్సీలకు అప్పగించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు కలెక్షన్​ పాయింట్ల వద్దే ఉన్న సేవలను ఇప్పట్నుంచి ఇంటి వద్దకే అందించనున్నట్లు వెల్లడించారు.

డోర్​ డెలివరీ సేవలతో ఆర్టీసీకి రోజుకు రూ.15 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పార్శిల్-కార్గో సేవలను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 12.5 లక్షల పార్శిళ్లను డెలివరీ చేసినట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు.

Last Updated : Dec 10, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.